కారేపల్లి: సీసీఐ కేంద్రంలో అగ్ని ప్రమాదం... ఇదే కారణమా?

716చూసినవారు
కారేపల్లిలోని శ్రీలక్ష్మిప్రియా కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. పత్తిని బేళ్లుగా మార్చే క్రమంలో రాయి వంటివి పడి నిప్పు రవ్వలు వచ్చి కన్వేయర్ బెల్ట్ వద్ద అంటుకోవడమే ప్రమాదానికి కారణమని మిల్లు యజమాని రాహుల్ తెలిపారు. అండర్ గ్రౌండ్ లోని మిషనరీ బెల్టుల వద్ద నుంచి పొగ రావడాన్ని గుర్తించిన కార్మికులు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది.

సంబంధిత పోస్ట్