
బావిలో దూకిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ చలపతి (వీడియో)
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో మంగళవారం ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి, తాను బావిలో దూకుతున్నట్లు చెప్పి కాల్ కట్ చేసింది. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఘటనా స్థలాన్ని గుర్తించి, హెడ్ కానిస్టేబుల్ చలపతి తన ప్రాణాలను పణంగా పెట్టి బావిలోకి దూకి మహిళను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం మహిళకు చికిత్స అందించి, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




