ఖమ్మం: జూన్ 3, 4 తేదీల్లో కార్గో పార్సిళ్ల వేలం

2చూసినవారు
ఖమ్మం: జూన్ 3, 4 తేదీల్లో కార్గో పార్సిళ్ల వేలం
ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని కార్గో పార్సిల్ కౌంటర్‌లో చాలాకాలంగా తీసుకెళ్లని వస్తువులకు జూన్ 3, 4 తేదీల్లో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆర్టీసీ లాజిస్టిక్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు. ఈ వేలంలో ఎలక్ట్రికల్ వస్తువులు, ద్విచక్ర వాహనాలు, జేసీబీ స్పేర్ పార్ట్స్, ఆటోమొబైల్ సామగ్రి వంటివి ఉండనున్నాయి. ఆసక్తిగలవారు ఎలాంటి ముందస్తు డిపాజిట్ లేకుండానే నేరుగా ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్