ఖమ్మం కార్పొరేషన్‌లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకే ఇంటి నంబరును రెండు ఇళ్లకు కేటాయించడంతో బాధితురాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తప్పిదంపై మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. సమస్యను పరిష్కరించాలని కోరగా, అధికారులు రోజు కార్యాలయం చుట్టూ తిప్పుతూ అసహనానికి గురిచేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆమె అధికారులను కోరారు.