ఖమ్మం: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు

10చూసినవారు
ఖమ్మం: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు
సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు క్వారీ గుంతలో గల్లంతైన ఘటన పట్టణ శివారులో విషాదం నింపింది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివ(13), నాగబాబు(14) ఆదివారం మధ్యాహ్నం మెట్టాంజనేయస్వామి ఆలయం వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you