ఖమ్మం: చికిత్స పొందుతూ మహిళ మృతి

6చూసినవారు
ఖమ్మం: చికిత్స పొందుతూ మహిళ మృతి
తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ రేవతి (32) మనస్తాపానికి గురై డిసెంబర్ 22న చీరతో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. 2025 ఏప్రిల్ 29న ఇదే కుటుంబంలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందగా, అప్పటినుండి రేవతి పిల్లలు లేరని ఆవేదన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఇంట్లో పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.