ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఎక్సైజ్ స్టేషన్–2 సిబ్బంది శుక్రవారం గంజాయి పట్టున్నారు. ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ వాహన తనిఖీలు చేపట్టగా బొక్కలగడ్డ ప్రాంతంలో తల్లాడకు చెందిన తమ్మిశెట్టి ఆనంద్ విద్యార్థులకు విక్రయించేందుకు గంజాయి తీసుకురాగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 1. 020 కేజీల గంజాయి, మొబైల్, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.