ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లాచెరువు గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా ఉత్సాహంగా జరిగింది. చిన్న స్కూల్ సమీపంలోని వినాయకుడి వద్ద భక్తులకు స్వామివారి ప్రసాదంగా 10 కిలోల లడ్డూను లక్కీ డ్రా ద్వారా అందజేశారు. ఈ లక్కీ డ్రాలో ముద్రబోయిన వియాన్స్ లక్షిత్, కోటేశ్వరరావు కుమారుడు, అదృష్టవంతుడిగా నిలిచి 10 కిలోల లడ్డూను కైవసం చేసుకున్నారు. లక్కీ డ్రా విజేతగా లక్షిత్ ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విజేతకు అభినందనలు తెలిపారు.