ఖమ్మం సర్కిల్ పరిధిలో పిడుగులు, మెరుపుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా 109 లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈ శ్రీనివాస చారి తెలిపారు. ఇవి అధిక వోల్టేజ్‌ను భూమిలోకి మళ్లించి ఉపకరణాలను కాపాడతాయని, ముందస్తు చర్యలతో వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.