హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జేఎన్జే హౌసింగ్ సొసైటీ సభ్యులు ఇళ్ల స్థలాల కోసం ధర్నా నిర్వహించారు. పేట్ బషీరాబాద్, నిజాంపేట్లో గతంలో కేటాయించిన భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ, 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రత్యేక జీవో ద్వారా స్థలాలు కేటాయించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సొసైటీ అధ్యక్షుడు రమణారావు, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పాత స్థలాలనే కేటాయించాలని సభ్యులు తీర్మానించారు.