గత కొన్ని నెలలుగా రాత్రి పూట తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా వున్న పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్, సిసిఎస్ పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన ఖమ్మం జిల్లా సెన్ట్రింగ్ వర్కర్, మధిర మండలం ఆత్కూరు గ్రామంకు చెందిన నిందితుడు కంబంపాటి ఏసోబు @ కందుల సురేష్ రెడ్డి (45)ని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ కు తరలించారు.