సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి

80చూసినవారు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి
సింగరేణి మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి గౌడ నాయకులు పోలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోల గాని శ్రీనివాస్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి, జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదిపత్య కులాలు సామాన్యులపై తమ అణిచివేత ఎల్లకాలం సాగాలనుకుంటున్నాయని దోపిడి, అణిచివేతల నుండే తిరుగుబాటు మొదలవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్