శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా, ఫిబ్రవరి 1న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద ఉదయం 6 గంటలకు 'విలువలతో కూడిన రన్ అండ్ రైడ్' పేరుతో 3కే రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. శ్రీసత్యసాయి బాబా దివ్య బోధనలు, మానవీయ విలువలను చాటి చెప్పే ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.