5 రోజుల శిశువు మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

14చూసినవారు
5 రోజుల శిశువు మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజుల నవజాత శిశువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 30న జన్మించిన శిశువు పాలు కక్కుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగి, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్