వరద నీటితో సత్తుపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం మునిగిపోయింది. మొదటి అంతస్తులోకి సైతం నీరు చేరడంతో అధికారులు నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. జిల్లా అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.