ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఘన వీడ్కోలు

1783చూసినవారు
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఘన వీడ్కోలు
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై హైదరాబాద్ కు వెళ్తున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ కి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం జిల్లా కార్యవర్గం తరఫున అభినందనలు తెలిపి, ఘనంగా సన్మానించారు. ఈ తక్కువ కాలంలో జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలిపినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో కార్యదర్శి మోదుగు వేలాద్రి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, డాక్టర్ విజయకుమార్, మల్లెల రవీంద్ర ప్రసాద్, కనపర్తి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, టీజీవో కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్