రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

6చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆదివారం రాత్రి కల్లూరు మండలం రావికంపాడుకు చెందిన కోలా సాయి (19) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ట్రాక్టర్‌ను ఢీకొని మృతి చెందాడు. చెన్నూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద డ్రైవర్ బసవయ్య నిర్లక్ష్యంగా మలుపు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయి మృతితో రావికంపాడులో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్