ఉమ్మడి KMM జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల ముదిగొండలో పంచాయతీ సెక్రటరీ పట్టుబడగా, తాజాగా అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈ శ్రీనివాస్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అవినీతిపరులను కఠినంగా శిక్షిస్తామని, లంచం అడిగితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మంగళవారం హెచ్చరించారు.