ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల ముదిగొండ మండలం బాణాపురంలో ఇంటి నంబర్ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ సెక్రటరీ పట్టుబడగా, తాజాగా అశ్వారావుపేటలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈఈ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతిపరులను ఉపేక్షించేది లేదని, లంచం అడిగితే తక్షణమే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ మంగళవారం హెచ్చరించారు.