ఎస్సీ, బాలికనుహాస్టల్ నుండి రాత్రి 10గం, , బాలికను వెల్లగొట్టిన
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో చలికి దుప్పటి అడిగిన 8వ తరగతి విద్యార్థినిని వార్డెన్ రాత్రి 10 గంటలకు బయటకు పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్‌కు పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కటుకూరి శేఖర్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం, గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.