ఖమ్మం జిల్లాలో యూపీఐ డిజిటల్ చెల్లింపులపై కొత్త వ్యాపారి రుసుముల భారం మోపొద్దని ఏఐవైఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి కొండపర్తి గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ రుసుముల విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటిస్తామని జిల్లా అధ్యక్షుడు మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి, కార్యదర్శి చింతల రమేష్ హెచ్చరించారు. ఖమ్మం కొత్త బస్టాండ్లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రుసుముల ఉపసంహరణ కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, యువతపై పరోక్ష భారం పడకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.