నవంబర్ 6న ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మోడల్ టెస్ట్

12చూసినవారు
నవంబర్ 6న ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ మోడల్ టెస్ట్
ఖమ్మం జిల్లా కేంద్రంలో నవంబర్ 6న ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఐ, కానిస్టేబుల్ మోడల్ టెస్ట్‌ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కార్యదర్శి చింతల రమేష్ కోరారు. పరీక్ష విజయవంతానికి కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిళ్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రస్థాయి నిపుణులు రూపొందించిన ప్రశ్నపత్రంతో జరిగే ఈ పరీక్ష అభ్యర్థులకు తమ ప్రతిభ, ర్యాంకును తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. వివరాలకు 9908842328, 9490469559, 9963918170 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మద్దోజు శ్రావణ్, చిరా కృష్ణ ప్రసాద్, బొప్పి ఉమా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్