ఖమ్మం తెలంగాణ భవన్ లో అంబేద్కర్ జయంతి

65చూసినవారు
ఖమ్మం తెలంగాణ భవన్ లో అంబేద్కర్ జయంతి
బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఖమ్మం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిజ్ఞలు చేశారు.