ఖమ్మం ఎంసీహెచ్‌లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసికందు చేయి తొలగించిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ మంగళవారం విచారణ చేపట్టింది. అర్ధరాత్రి వరకు సాగిన ఈ విచారణలో ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్, ఆర్ఎంవో రాంబాబులను కమిటీ ప్రశ్నించింది. చిన్నారి చేయి వాచి, నల్లగా మారుతున్నా ఎందుకు స్పందించలేదని నిలదీసింది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి, హెచ్‌ఆర్‌సీకి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.