వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన మోదుగు చుక్కమ్మ అనే వృద్ధురాలి నివాసగృహం శిథిలావస్థలో ఉందని తెలుసుకున్న వైరా ఎస్సై పుష్పాల రామారావు, ఆమె ఇంటి నిర్మాణానికి 20 వేల రూపాయల విలువైన మెటీరియల్ ను అందజేశారు. ఈ సహాయంతో వృద్ధురాలి ఇంటి పునర్నిర్మాణం చేపట్టారు. ఎస్సై చేసిన సాయానికి వృద్ధురాలు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సైకి కుమారుడు మోదుగు గోవిందరావు శాలువాతో సత్కరించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని, చేయూతనివ్వాలని ఎస్సై రామారావు స్థానికులకు, యువతకు పిలుపునిచ్చారు.