చెరువులో గల్లంతైన 11 మంది SDRF సిబ్బంది క్షేమం ?

0చూసినవారు
చెరువులో గల్లంతైన 11 మంది SDRF సిబ్బంది క్షేమం ?
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో గల్లంతైన 11 మంది ఎస్‌డిఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారిలో ఐదుగురితో అధికారులు ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దివాకర్ స్వయంగా సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ, సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సూచించారు.

సంబంధిత పోస్ట్