ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుడిసెల్లో నివసించే నిరుపేదలు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆకలితో అల్లాడుతున్న వారిని ఆదుకునేందుకు స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమం ముందుకు వచ్చింది. గురువారం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ యనమల విజయ్ ఆర్థిక సహకారంతో, ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవికుమార్ బాధితులకు భోజన వసతి కల్పించారు. తుపానును సైతం లెక్కచేయకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించిన రవికుమార్ కృషిని గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ప్రశంసించారు.