ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సరిహద్దు సమీపంలో బుధవారం కూలీల ఆటో పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. మిగతా వారికి గాయాలయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు గమనించి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.