ఆటో కార్మికుడికి కృత్రిమ కాలు అందజేత

2425చూసినవారు
ఆటో కార్మికుడికి కృత్రిమ కాలు అందజేత
అనారోగ్యంతో ఆటో కార్మికుడు రెపాకుల మహేష్ కాలు కోల్పోవడంతో పువ్వాడ ఫౌండేషన్‌ను సంప్రదించగా, నాగ్‌పూర్ నుంచి తెప్పించి కృత్రిమ కాలును అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు సహకారంతో, మమతా హాస్పిటల్ డైరెక్టర్ పువ్వాడ నరేన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలును మహేష్‌కు అందించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ, మమతా ఆటో యూనియన్ అధ్యక్షులు ప్రతాపనేని ఉపేందర్, ఖానాపురం హవేలీ సీపీఐ నాయకులు ఆమదాల వెంకన్న, చార్లెస్, యూసఫ్, వీరబాబు, వెంకటరమణ, సత్యనారాయణ, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుడికి అండగా నిలిచిన పువ్వాడ ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్