కలెక్టర్ ముజమ్మిలాఖాన్ సూచనలతో ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో రకరకాల పూలతో గార్డెన్ ను తీర్చిదిద్దగా ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కాయి. రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యాన హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన గార్డెనింగ్ ఫెస్టివల్లో ఖమ్మం కలెక్టరేట్ గార్డెన్ కు అవార్డు ప్రకటించారు. రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా చేతుల మీదుగా జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్ అవార్డు అందుకోగా, జిల్లా కలెక్టర్ అభినందించారు.