ఖమ్మంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

4చూసినవారు
ఖమ్మంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు
ఖమ్మం జిల్లాలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఘనంగా నిర్వహించింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి, సామాజిక సమానత్వానికి, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.