బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి: BKMU

0చూసినవారు
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి: BKMU
మోదీ ప్రభుత్వ విధానాల వల్లే బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారని BKMU జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దినేని కర్ణకుమార్ ఆరోపించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో UFBU ఆధ్వర్యంలో చేపట్టనున్న మూడు రోజుల సమ్మెకు BKMU సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, బోనస్ వ్యత్యాసాలు తొలగించాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని ఖమ్మంలో డిమాండ్ చేశారు. సమ్మెతో ఖాతాదారులు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్