ఖమ్మంలో గణేశుడి లడ్డూను దక్కించుకున్న బీజేపీ నాయకుడు

1476చూసినవారు
ఖమ్మంలో గణేశుడి లడ్డూను దక్కించుకున్న బీజేపీ నాయకుడు
ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ వేదభూమిలో గల గణపతి నవరాత్రులలో బుధవారం ఉదయం స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడు, ధార్మిక సెల్ కన్వీనర్ మార్తి వీరభద్ర ప్రసాద్ వేలంపాటలో గణేశుడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గణేశుడికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభిషేకం, సహస్రనామార్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. లడ్డూ తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మార్తి వీరభద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్