సత్తుపల్లి మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని, ప్రజల పక్షాన పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దుగ్గిదేవర వెంకటలాల్, గ్రామ అధ్యక్షుడు నల్లగొండ శేషయ్య, మాజీ సొసైటీ డైరెక్టర్ కటిక నరసింహారావుతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.