మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ ధర్నాకు పిలుపు

6చూసినవారు
మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై బీఆర్‌ఎస్ ధర్నాకు పిలుపు
ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న, వరి కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 9వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు, మండల అధ్యక్షులు, రైతు నాయకులు సమన్వయంతో పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్