ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురం చేరువు వద్ద గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న భక్తులకు, నగర ప్రజలకు 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లా రోజ్ లీన ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి సరఫరా బుధవారం చేశారు. ఈ కార్యక్రమాన్ని నగర మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు, నిర్వాహకులు పల్లా జాన్ అబ్రహంతో కలిసి ప్రారంభించారు. పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా ఈ ఏర్పాటు జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ షకీనా, జావేద్, చాంద్ పాషా, తిరుమల రావు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.