ఖమ్మంలో డివైడర్ ఢీకొని కారు బోల్తా

69చూసినవారు
ఖమ్మం నగరంలో మంగళవారం కారు బోల్తా పడింది. గొల్లగూడెం రోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో కారు డివైడర్ ఢీకొని బోల్తా కొట్టింది. ఒక మహిళ కారు నడుపుతున్నట్లుగా సమాచారం. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిసింది. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.