బోనకల్ మండలంలోని కలకోట గ్రామీణ వికాస్ బ్యాంకులో గత 25 రోజులుగా నగదు కొరత నెలకొంది. వ్యవసాయ సీజన్ కావడంతో నగదు అవసరాల కోసం బ్యాంకుకు వస్తున్న రైతులు, వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. పైస్థాయి నుంచి నగదు సరఫరా కావడం లేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నట్లు ఖాతాదారులు మంగళవారం తెలిపారు. దీనితో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.