మువ్వ విజయ్ బాబును కలిసిన ప్రముఖులు

2చూసినవారు
మువ్వ విజయ్ బాబును కలిసిన ప్రముఖులు
సత్తుపల్లిలో నిర్వహిస్తున్న 73వ రాష్ట్ర మహిళల సీనియర్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ సందర్భంగా మాజీ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయ్ బాబును చల్లా రామకృష్ణారెడ్డి, వెనిగళ్ల నాగేశ్వరరావు, కరాటే వేణు, దుర్గ, డీఎస్‌ఎన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా ముచ్చటించారు. రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మహిళలకు క్రీడారంగంలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటున్న క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్