చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

3చూసినవారు
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా పాత ధర్నా చౌక్‌లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ భూమి, హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, ఆమె తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాలు, మహిళలు హక్కుల కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్