చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటితరానికి ఆదర్శం కలెక్టర్

5చూసినవారు
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటితరానికి ఆదర్శం కలెక్టర్
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, వెట్టిచాకిరి, దోపిడీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఖమ్మం వైరా రోడ్డులోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె పాత్ర చిరస్మరణీయమని శనివారం కొనియాడారు. ఐలమ్మ పోరాట విలువలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్