ఖమ్మం జిల్లా రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్రతండాకు చెందిన రెండు కుటుంబాల మధ్య చిన్న విషయమై తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటనపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఉస్మాన్ షరీఫ్ మాట్లాడుతూ, ఫిర్యాదుల మేరకు విచారణ జరుగుతోందని తెలిపారు.