వర్షాల కారణంగా మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ రద్దయింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని సీఎం మంత్రులకు సూచించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచే సాయంత్రం 4 గంటలకు సీఎం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.