సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

2చూసినవారు
సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓసీల్లోకి నీరు చేరడంతో, 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు, 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు. ప్రస్తుతం భారీ మోటార్ల సహాయంతో నీటిని తొలగించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్