పురపాలక ఎన్నికల మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

2చూసినవారు
పురపాలక ఎన్నికల మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఖమ్మం కలెక్టరేట్ లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి గురువారం ప్రారంభించారు. పురపాలక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై ఈ కేంద్రం ద్వారా నిఘా ఉంచుతారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్