ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో ఈనెల 30న చింతకాని మండలం మత్తేపల్లి క్రాస్ రోడ్ వద్ద జరిగే ‘రైతు ఆశీర్వాద సభ’కు రైతులు భారీగా తరలిరావాలని జిల్లా కిసాన్
కాంగ్రెస్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్ కోరారు. తల్లాడ మండలం మల్లారంలో శనివారం ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యే ఈ సభలో రైతు భరోసా నిధుల జమపై ప్రకటన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.