జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో దళితబంధు, సోలార్ ప్లాంట్లు, పర్యాటక అభివృద్ధి, విద్యా సంస్థల భవన నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ప్రజలకు తక్షణ ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని, లక్ష్యాలను అధిగమించాలని ఆయన సూచించారు.