ఓటర్ల జాబితా సవరణపై ఆందోళనలు, డిప్యూటీ సీఎం పేరు అనుమానాస్పద జాబితాలో చేరిక

8చూసినవారు
ఓటర్ల జాబితా సవరణపై ఆందోళనలు, డిప్యూటీ సీఎం పేరు అనుమానాస్పద జాబితాలో చేరిక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2002 ఓటరు జాబితా ఆధారంగా బూత్‌ల వారీగా మ్యాపింగ్ చేస్తున్న బీఎల్‌ఓలు, పేర్లలో స్వల్ప తేడాలున్న ఓటర్లను అనుమానాస్పద జాబితాలో చేరుస్తున్నారని అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు కూడా అనుమానాస్పద ఓటర్ల జాబితాలో చేర్చడం చర్చనీయాంశమైంది. ఈ ప్రక్రియపై మంగళవారం పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్