రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది.. కిలారు అనిల్

997చూసినవారు
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది.. కిలారు అనిల్
ఖమ్మం జిల్లాలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యే రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ ఆదివారం  పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, రైతుల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, త్వరలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులందరూ పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఖమ్మం నగరంలో గోడపత్రాలను ఆవిష్కరించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్