ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించి రూ.13 లక్షల బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ సి. అయోధ్య కుటుంబంతో కలిసి పాఠశాలకు సోమవారం తాళం వేశారు. ఈ ఘటనతో ఉపాధ్యాయులు,
విద్యార్థులు ఆరుబయట నిలిచిపోయారు. అనంతరం విద్యార్థులను అంగన్వాడీ కేంద్రంలో కూర్చోబెట్టారు. జిల్లా కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు తిరిగినా బిల్లులు అందలేదని, అప్పు చేసి పనులు చేయించానని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.